Telangana రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించుకున్నారు. Telangana ప్రజల కోరిక మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపొందించారు. మొదటగా మహిళా దర్బార్ ను ప్రారంభిస్తున్నారు. ఈ నెల 10న Raj Bhavanలో మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మొదటి ప్రజాదర్భార్ పూర్తిగా మహిళల కోసం కేటాయించారు. ఇటీవలి కాలంలో గవర్నర్‌తో ముఖ్యమంత్రి ఎడ మొహం - పెడ మొహంగా ఉంటున్నారని చెబుతున్నారు. సీఎం ఎలా ఉన్నా.. తాను ప్రజాదర్భార్ నిర్వహించి తీరాలని Governor పట్టుదలగా ఉండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సహకరిచకపోతే సమస్యలు పరిష్కారం కావని.. యంత్రాంగం అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని కొంత మంది గుర్తు చేస్తున్నారు.